నంద్యాల జిల్లాలో పాలిసెట్ డిప్లొమా ప్రవేశ
పరీక్షలు ఎనిమిది కేంద్రాల్లో విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 7,221 మంది విద్యార్థులకు గాను 6,856 మంది పరీక్షలకు హాజరయ్యారని కోఆర్డినేటర్ శైలేంద్రకుమార్ శనివారం తెలిపారు. డోన్, నంద్యాల, నందికొట్కూరు వంటి కేంద్రాల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా ఉంది.
పరీక్షల ఫలితాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.