బీసీ కార్పోరేషన్ ద్వారా 2156 ఋణాలు, ఎస్సీ కార్పోరేషన్ ద్వారా 954 ఋణాలు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1920 ఋణాలు ఇచ్చి వారికి స్వయం ఉపాధి ద్వారా ఋణాలు మంజూరు చేశామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా శుక్రవారం నంద్యాల కలెక్టరేట్ లో అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 514 యూనిట్ల లబ్ధిదారులకు అనుమతులు మంజూరు చేస్తూ అందరి సహకారంతో రూ.12 కోట్ల 37లక్షల 50వేల సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందన్నారు.