నంద్యాల మండలం కానాలలో ఎస్సీ స్మశాన వాటికలో కంచ, తాగునీరు, రహదారి, షెడ్డు, లైటింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎస్డిపిఐ నాయకులు బుధవారం ఆరోపించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.