నంద్యాల శాంతినికేతన్ స్కూల్‌లో మంగళవారం, శక్తి టీం సభ్యులు, మహిళా పోలీస్ స్నేహలత విద్యార్థినులకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు 112, 1930, వన్ స్టాప్ సెంటర్ సేవల గురించి వివరించారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని సూచించారు.