
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నికోలా పియట్రాంగెలీ కన్నుమూత
ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ఈయన రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే. నికోలా 1933లో జన్మించారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. కాగా నికోలా తన కెరీర్లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు.




