నంద్యాల: నేర నివారణకు విజిబుల్ పోలీసింగ్

4చూసినవారు
నంద్యాల: నేర నివారణకు విజిబుల్ పోలీసింగ్
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, నేర నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు. త్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్