నంద్యాల పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానాయకుడు
ఎన్టీఆర్ అని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.