నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షొరాణ్
ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజాసేవ, బలహీన వర్గాల అభ్యున్నతికి
ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.