ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో వడ్డే మనోజ్ హత్య ఘటన నేపథ్యంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.