పాణ్యం మండలం గోనవరం, ఆలమూరు గ్రామాల్లో రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి, వరి ధర కేవలం ₹1100కే పరిమితమవడం అన్యాయమని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యవసాయం నిలవదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడం, పంటలకు సరైన ధర లేకపోవడం వల్ల రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.