నంద్యాల జిల్లా మాధవి నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గ్రీవెన్స్ డే నిర్వహించారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వీకరించి, తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఆమె తెలిపారు.