మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

1238చూసినవారు
మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ
బనగానపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈద్గా నగరంలో లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ. 2,725 కోట్లు పంపిణీ చేస్తోందని, పింఛన్‌ను రూ. 3,000 నుంచి రూ. 4,000కు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదేనని మంత్రి తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తూ, అవ్వాతాతల సౌకర్యార్థం మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్