వైసీపీ డ్రామాలకు ప్రజలే బుద్ధి చెప్పారు: టీడీపీ నేతలు

0చూసినవారు
నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయ డ్రామాలు, కుతంత్రాలకు ప్రజలు ఇప్పటికే తగిన గుణపాఠం చెప్పారని టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు బాబుల్లా, మాజీ కౌన్సిలర్ మిద్దె ఉసేని, మాజీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, డాక్టర్ బాలస్వామి విమర్శించారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నంద్యాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన వారు, మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నాయకత్వంలో పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్