నంద్యాల రైల్వే స్టేషన్‌లో గుంటూరు-కాచిగూడ రైల్లో ప్రయాణికుల నాలుగు మొబైల్ ఫోన్లను దొంగిలించిన నిందితుడు కర్ణాటకకు చెందిన హుల్లప్ప హెగ్గప్ప హెచ్. రప్పనవర్ను రైల్వే పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 1.22 లక్షల విలువైన నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి 35(3) నోటీసు జారీ చేసినట్లు ఎస్సై కుమారి తెలిపారు.