
భర్త చేతిలో ఇన్స్టాగ్రామ్ స్టార్ హత్య
చెన్నై నంగనల్లూరులో ఫ్యాషన్ డిజైనర్ నాగలక్ష్మి (42) హత్యకు గురయ్యారు. భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్‌గా ఎదుగుతుండటంతో అసూయతో రగిలిపోయిన భర్త సుబ్రహ్మణ్యం (52), ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేట కొడవలితో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన చిన్న కొడుకుకు 'నేను, అమ్మ ఇక ఉండం.. నీ కోసం అన్నం పెట్టాను వచ్చి తిను' అని మెసేజ్ పంపి, గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




