
భర్తను చంపిన భార్య.. ఏడాది తర్వాత బయటపడిన మృతదేహం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణ ఘటన వెలుగలోకి వచ్చింది. బీహార్‌కు చెందిన మహ్మద్ ఇజ్రాయెల్ అక్బరాలి అన్సారీ రూబీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ఇద్దరు పిల్లలతో కలిసి అహ్మదాబాద్‌లో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో రూబీ ఇమ్రాన్ అక్బర్‌భాయ్ వాఘేలా అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. అన్సారీకి ఈ విషయం తెలియడంతో భార్యను శారీరకంగా హింసించేవాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని రూబీ ప్రియుడితో కలిసి చంపేసింది. మృతదేహాన్ని వంటగది కింద గొయ్యి తవ్వి పూడ్చిపెట్టారు. ఏడాది తర్వాత విషయం బయటపడటంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.




