నంద్యాల హైవేలో దారి దోపిడీ.. భార్య, భర్తలపై దాడి

1088చూసినవారు
నంద్యాల నుంచి పాణ్యం వెళ్ళే దారిలో శాంతి రామ్ హాస్పిటల్ దగ్గర బైక్ పై వెళ్తున్న దంపతులపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. భార్య, భర్తలను విపరీతంగా కొట్టి, గాయపర్చి, భార్య మెడలోని రెండు తులాల బంగారు గొలుసు, కొంత నగదు దోపిడీ చేశారు. పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన భార్యా భర్తలకు ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్