మహిళల భద్రతకు 'శక్తి యాప్': నంద్యాల రైల్వే స్టేషన్‌లో అవగాహన

152చూసినవారు
మహిళల భద్రతకు 'శక్తి యాప్': నంద్యాల రైల్వే స్టేషన్‌లో అవగాహన
నంద్యాల రైల్వే స్టేషన్‌లో, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు రఫీ మహిళలకు 'శక్తి యాప్' గురించి అవగాహన కల్పించారు. ప్రయాణ సమయంలో ఏదైనా ఆపద ఎదురైతే, ఈ యాప్ ద్వారా పోలీసులకు తెలియజేయవచ్చని, తక్షణమే స్పందన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి మహిళా తమ సెల్ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఇది వారికి పోలీసుల భద్రతను అందిస్తుందని ఆయన సూచించారు.