సగర సంఘం వనభోజనాలకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యురాలికి ఆహ్వానం

1చూసినవారు
నంద్యాల జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న వనభోజన మహోత్సవాలకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు శివమ్మ గారికి ఆహ్వానం అందింది. నంద్యాల జిల్లా సగర సంఘం అధ్యక్షుడు ఇమ్మడి అనిల్ రామయ్య, కర్నూలు జిల్లా సభ్యులు వారికి ఆహ్వాన పత్రికలు అందజేశారు. డాక్టర్ ఇమ్మడి అపర్ణ, ఇమ్మడి అనూష ఆమెను సత్కరించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదన్న గారు శనివారం కర్నూలు నుంచి తిరుపతికి పాదయాత్ర ప్రారంభిస్తున్నారని, వారి యాత్ర విజయవంతం కావాలని సంఘం తరఫున ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పరి సురేష్ బాబు, కర్నూలు జిల్లా అధ్యక్షులు కొంగనపాడు ఉప్పరి శివన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you