
జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు విడుదల
ఏపీ ప్రభుత్వం జూన్ నెలకు గాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను విడుదల చేసింది. ఈ నెలలో రూ. 2,728 కోట్లు విడుదల చేయగా, 62,34,445 మందికి పెన్షన్లు అందనున్నాయి. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు కూడా మంజూరు అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రూ.65,886 కోట్లు ఖర్చు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.




