నంద్యాల మార్కెట్ ఘర్షణలో ముగ్గురికి గాయాలు (వీడియో)

17చూసినవారు
నంద్యాల కూరగాయల మార్కెట్లో భూసరిహద్దు వివాదం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టులో పెండింగ్లో ఉన్న స్థలం విషయంలో రెండు వర్గాలు ఎదురుపడగా, కలాం, ఉస్మాన్, అబూ బకర్‌లపై దాడి చేసి కళ్లలో కారం చల్లారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్