నంద్యాలలో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ అవగాహన

8చూసినవారు
నంద్యాలలో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ అవగాహన
నంద్యాల పట్టణంలోని NGO’S కాలనీలో శనివారం రోడ్డు ప్రమాదాల నివారణపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ భాషా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు, స్టాపర్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్