నంద్యాల జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 3.14 లక్షల మంది విద్యార్థులు 1,959 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. వెలుగోడులో గురువారం ఆమె మాట్లాడుతూ మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులే అని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.