
నంద్యాల: సైబర్ నేరాలపై మహిళలకు పోలీసుల అవగాహన
నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రం రామలింగారెడ్డి కళాశాల వద్ద మూడవ పట్టణ ఎస్సై నాగేంద్ర మహిళలకు సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత, మహిళా రక్షణపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని లింకులు, సందేశాలకు స్పందించవద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ ప్రయోజనాలను వివరించారు.








































