
నంద్యాల: అపరిచితుల తినుబండారాలు తినవద్దని సూచన
నంద్యాలలోని మూలసాగరం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం శక్తి టీం సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. అపరిచితులు ఇచ్చే తినుబండారాలు తీసుకోరాదని, 100, 112 అత్యవసర కాల్స్ ప్రయోజనాలను వివరించారు. నో టచ్ విధానంపై అవగాహన కల్పించి, ఉపాధ్యాయులు శక్తి యాప్ వినియోగించాలని సూచించారు.






































