
నంద్యాల జిల్లాలో పోలీసుల స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు సిబ్బంది కార్యాలయాలు, పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.





































