Nov 27, 2025, 11:11 IST/
ALERT.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Nov 27, 2025, 11:11 IST
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 30న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.