Feb 08, 2026, 17:02 IST/
హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న వారికి గుడ్‌న్యూస్
Feb 08, 2026, 17:02 IST
హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. HRA ( ఇంటి అద్దె భత్యం) పన్ను మినహాయింపు పరిధిని విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు మెట్రో నగరాల్లో నివసించే వారికి మాత్రమే 50 శాతం HRA క్లెయిమ్ అవకాశం ఉండగా, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్‌లను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారు. దీంతో ఈ నగరాల్లో అద్దె ఇళ్లలో ఉండే ఉద్యోగులు 40 శాతం బదులుగా 50 శాతం HRA మినహాయింపును పొందుతారు.