
పాణ్యంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
పాణ్యం మండలంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎద్దుల రామకృష్ణ (50) అనే వ్యక్తి మృతి చెందారు. తిరుమలగిరి వద్ద గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న హైవే పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, భార్య భాగ్యలక్ష్మి, కొడుకు ఉన్నారు. మృతదేహాన్ని నంద్యాల జీజీహెచ్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు.







































