కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి బుధవారం కల్లూరు మండలం ఏ. గోకులపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు భవిష్యత్తు కోసం కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఆమె సూచించారు. 100 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని హెడ్ మాస్టర్‌కి ఆదేశించారు. విద్యార్థులకు 85% మార్కులు సాధించే చిట్కాలు, సి-డి గ్రేడ్‌లపై ప్రత్యేక శ్రద్ధ, యూనిట్ టెస్టుల్లో మెరుగైన ఫలితాలు పొందే మార్గాలను వివరించారు. పాఠశాల వంటగది, ఆవరణ పరిశీలించి పచ్చదనం, శుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు.