శకునాల పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో 83% ఉత్తీర్ణత

1515చూసినవారు
శకునాల పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో 83% ఉత్తీర్ణత
కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్ మండలంలో గల శకునాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో 83% ఉత్తీర్ణత సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎనిమిది మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. కానుగల పూజిత 557 మార్కులతో పాఠశాల టాపర్‌గా, కురువ మాధవి 527 మార్కులతో రెండో స్థానంలో, కానుగల ప్రసన్న రాణి 521 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. టాప్ 3లో నిలిచిన బాలికలు రాష్ట్రస్థాయి కబడ్డీ, రగ్బీ పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఫలితాలు విద్యార్థుల కృషికి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనం.

సంబంధిత పోస్ట్