కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లెకల్ గ్రామంలో ఆదివారం, కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న బెల్ట్ షాప్ యజమాని కృష్ణ, సీఐ గంగాధర్ ను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, నిషేధిత బెల్ట్ షాపుల్లో వ్యాపారం చేయడమే నేరమని, చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు. వైన్ షాప్ నిర్వహణపై నిషేధం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, మినీ బెల్ట్ షాపుల్లో సీఐ సన్మానం జరగడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, తల్లేడు కృష్ణ కూడా పాల్గొన్నారు.