కర్నూలు రైల్వే అభివృద్ధికై నవంబర్ 1, 2 తేదీల్లో సిపిఎం నిరసన

5చూసినవారు
కర్నూలు జిల్లాలో రైల్వే అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 1, 2 తేదీల్లో 24 గంటల దీక్షలు, 3న మహాధర్నా నిర్వహించాలని సీపీఎం నగర కార్యదర్శులు టి. రాముడు, జిల్లా సభ్యులు ఎం. రాజశేఖర్, నగేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కల్లూరులో మాట్లాడుతూ, కర్నూలు–విజయవాడ ఇంటర్‌సిటీ రైలు, మచిలీపట్నం రైలు పునరుద్ధరణ, కొత్త రైల్వేలైన్లు, ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు పెంపు, రాయితీలు పునరుద్ధరణ, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్