పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం గడిగిరేవుల గ్రామానికి చెందిన గోదా కృష్ణవేణి ఫిర్యాదుతో భర్త వెంకట శివ భరత్‌తో పాటు అత్త, మామ, బావలపై వేధింపుల కేసు నమోదైనట్లు ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితమే వివాహమైనప్పటికీ మానసికంగా వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.