గడివేముల: ఉపాధి హామీపథకం పనులపై ప్రణాళికకు గ్రామసభ ఆమోదం

1116చూసినవారు
గడివేముల మండల కేంద్రంలో శనివారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సర పనుల గుర్తింపు ప్రణాళికపై గ్రామసభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ ఎస్ఏ రఫీ, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు పి. జయంత్ రెడ్డి, ఎంపీటీసీ రామస్వామి పాల్గొన్నారు. గ్రామ ప్రజలు సూచించిన పనులను ప్రభుత్వం ప్రతిపాదనలతో పాటు సభ ఆమోదించింది. సచివాలయం సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్