మంగళవారం కర్నూలులో పాణ్యం నియోజకవర్గ వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనదని, దానిని పరిరక్షించడం కార్యకర్తల బాధ్యత అని నొక్కి చెప్పారు. వైఎస్
జగన్ ఆదేశాల మేరకు, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఏలకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.