రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివనరసింహారెడ్డి, బుట్టా ప్రతుల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వారు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ బాధితురాలు షేక్ హసీనాబీ మాట్లాడుతూ, అర్హత సాధించి అన్ని దశలు పూర్తి చేసినా చివరి దశలో తనకు అన్యాయం జరిగిందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందని చెప్పి, అనంతరం ఎటువంటి కారణం చెప్పకుండా నియామక పత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.