కల్లూరు: జ్ఞాన వికాసానికి గ్రంథాలయాల ప్రాధాన్యం: కె. ప్రభాకర్

998చూసినవారు
కల్లూరు అర్బన్ పరిధిలోని ముజఫర్‌నగర్ 32వ వార్డులోని తెలకపల్లి నరసింహయ్య గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. బుధవారం కమిటీ కార్యదర్శి వడ్డెమాను ధనేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీ. ఎన్. గ్రంథాలయ అధ్యక్షుడు ప్రభాకర్ విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించారు. స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, గ్రంథాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్