బ్రాహ్మణులపై వ్యంగ్యంగా పాట పాడిన పల్లెవోలు రమణ, సిడి నరసయ్యలపై కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసరావు సోమవారం డిమాండ్ చేశారు. కల్లూరులో నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యూట్యూబ్‌లో ఆ పాటను తొలగించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏన్డీఏ, తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.