కల్లూరు: ఉద్యోగం పేరుతో రూ. 40 లక్షల మోసం

0చూసినవారు
కల్లూరు: ఉద్యోగం పేరుతో రూ. 40 లక్షల మోసం
మంచి జీతం వచ్చే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 40 లక్షలు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు ఫిర్యాదు చేశారు. కల్లూరు మండలం హేమలత నగర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఉపేంద్ర @ శివ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. అయితే ఇప్పటివరకు ఉద్యోగం కల్పించకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్