కొత్తూరు: హుండీ లెక్కింపుతో రూ. 24. 69 లక్షల ఆదాయం

2చూసినవారు
కొత్తూరు: హుండీ లెక్కింపుతో రూ. 24. 69 లక్షల ఆదాయం
పాణ్యం మండలంలోని యస్. కొత్తూరు గ్రామంలోని శ్రీసుబ్రమణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం జరిగిన హుండీ లెక్కింపులో రూ. 24,69,127 నగదు, 10 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 747 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు. దేవాదాయశాఖ తనిఖీ అధికారి పి. హరిశ్చంద్రరెడ్డి పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you