మే 3వ తేదీన నిర్వహించనున్న నీట్ యూజీ–2026 పరీక్షకు సంబంధించి కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే 3న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయడం కోసం ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబడింది. హెల్ప్ డెస్క్ ల్యాండ్‌లైన్ నంబర్ 08518-277305 ద్వారా సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.