స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా కర్నూలు జిల్లాలో నెట్ జీరో హెల్తీ క్యాంపస్‌ల ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల అమలు, నెట్ జీరో హెల్తీ క్యాంపస్‌ల ఏర్పాటుపై సమగ్రంగా చర్చించారు.