కర్నూలు: విద్యుత్ అభివృద్ధి ద్వారానే ప్రాంత ప్రగతి సాధ్యం

5చూసినవారు
కర్నూలు: విద్యుత్ అభివృద్ధి ద్వారానే ప్రాంత ప్రగతి సాధ్యం
కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కేలచంద్ర జోసెఫ్ జార్జ్ సోమవారం ఓర్వకల్లు మండలం పిన్నాపురం ప్రాంతంలో గ్రీన్‌కో సంస్థ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక దేశం లేదా ప్రాంత అభివృద్ధి విద్యుత్ రంగంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. పిన్నాపురం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన అనేక అనుమతులను అధిగమించి ముందుకు తీసుకెళ్లడం ముఖ్యమని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you