గనిలో రైతులకు పథకాలపై ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అవగాహన

1088చూసినవారు
గనిలో రైతులకు పథకాలపై ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అవగాహన
గడివేముల మండలం గని గ్రామంలో శనివారం జరిగిన 'రైతన్నా–మీకోసం' కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఆమె రైతుల ఇళ్లకు వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. గ్రామంలో పారిశుధ్య సేకరణ కోసం నూతన ట్రాక్టర్‌ను ప్రారంభించి, పశుసంవర్ధక శాఖ ద్వారా పశువుల దాణా సబ్సిడీని రైతులకు అందజేశారు.