ఆదివారం నన్నూరులో మొక్కజొన్న పంటలను పరిశీలించిన ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్. మధుసూదన్, మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు రూ. 2500 మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారని, పెట్టుబడులు పెట్టినా సరైన ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతుల ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.