కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు పనుల్లో పురోగతి సాధించాలని ఇంచార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చింతలపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న డ్రోన్ సిటీ పనులను పరిశీలించి, భూసేకరణ, రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల పనులను సమీక్షించారు. డ్రోన్ తయారీ, టెస్టింగ్, పరిశోధనలకు అవసరమైన వసతులను వేగంగా పూర్తి చేయాలని, భూ సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.