పాలకొల్లు: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి

3చూసినవారు
ఓర్వకల్ మండలం పాలకొల్లు గ్రామం తలగుండం వద్ద నూతన సంవత్సరం రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలను పరామర్శించి, ఘటనపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :