మంగళవారం పాణ్యం మండలం గోనవరం, ఆలమూరు గ్రామాల్లో వరి రైతులతో సమావేశమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి, ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వరి ధర రూ. 1100కు పరిమితమవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని, అప్పుల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టి అసత్య ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.