అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని కర్నూలు జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుధవారం తడకనపల్లెలో మాట్లాడుతూ రాష్ట్రానికే కాకుండా యావత్తు దేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా తడకనపల్లె నిలిచిందన్నారు. ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా 10 నెలల కాలంలోనే 2294 పనులు చేపట్టేందుకు రూ. 2014 కోట్లు మంజూరు చేశామన్నారు.